22 March, 2026 | 8:12 AM

హుక్ స్టెప్ రీల్‌కు రూ.లక్ష బహుమతి

22-03-2026 12:00 AM

ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న కొత్త సినిమా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్య జీ యాదవ్ దర్శకత్వం వహించారు. పార్ధ గోపాల్, మేఘన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య విచ్చేశారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్.. ఈ సినిమాలోని ‘మరదలివే..’ పాటకు హుక్ స్టెప్‌తో రీల్స్ రూపొందించి, ఆ రీల్స్ లింక్‌ను 8074801661 వాట్సాప్ నంబర్‌కు పంపాలని కోరింది. అత్యుత్తమ రీల్‌కు మొదటిగా బహుమతి రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేల నగదును చెల్లిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

‘ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామ’ని చిత్ర నిర్మాత, హీరో పార్ధ గోపాల్ తెలిపారు. ‘ఈ సినిమా కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడి పనిచేశామ’ని హీరోయిన్ మేఘన చెప్పారు. దర్శకుడు సూర్య జీ యాదవ్ మాట్లాడుతూ.. “సినిమా ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్ డ్రామా మేళవింపుతో ఉంటుంది.

ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం” అన్నారు. సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ.. “ఇటీవల చిన్న చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘డైమండ్ డెకాయిట్’ కూడా అదే కోవకు చెందిన చిత్రం” అని తెలిపారు.