బావామరదళ్ల గిల్లికజ్జాలు
కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఇందులో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. సాయికుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మార్చి 26న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి శనివారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే లవ్‌స్టోరీగా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
హీరో హీరోయిన్ మధ్య ఉండే ప్రేమ, గిల్లికజ్జాలను హత్తుకునేలా రూపొందించారు. హీరో హర్ష్ రోషన్ తన మరదలైన హీరోయిన్ ప్రేమను గెలవటానికి ఏం చే శాడు? తనకు ఎదురైన సవాళ్లేంటి? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; గీత రచయిత: చద్రబోస్; సినిమాటోగ్రఫీ: సతీశ్ ముత్యాల; స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు; ఆర్ట్: నార్ని శ్రీనివాస్.




