ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం
28-04-2026 01:57 AM
ప్రమాదం నుంచి తప్పించుకున్న డ్రైవర్, క్లీనర
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఘటన
చేగుంట, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మెదక్ జిల్లా మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ౪.౩౦ గంటలకు ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన బస్సు రిపేర్ నిమిత్తం మెదకకు తీసుకువచ్చారు.
మరమ్మతులు పూర్తి కాగానే తిరుగు ప్రయాణంలో, మాసాయిపేట శివారులోని బంగారమ్మ గుడి వద్ద బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.గమనించిన డ్రెవర్, క్లీనర్ త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని, ఫైర్ ఇంజన్‌ను రప్పించి మంటలను అదుపు చేశారు.






