28 April, 2026 | 4:28 AM

ఢిల్లీ మెడలు వంచిన పార్టీ

28-04-2026 01:57 AM
  1. అన్యాయానికి గురై నెత్తురు మండే ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా
  2. పరిపాలనలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టిన నేత కేసీఆర్
  3. బలంగా, బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుదాం
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాం తి): మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి, తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్య లో సమీకరిస్తూ.. వారికి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ.. అంబేద్కర్ విధానా ల స్ఫూర్తితో అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా దగాకు గురై, అన్యా యానికి గురై నెత్తురు మండే ఒక జాతి ఎత్తి న జెండా గులాబీ జెండా అని స్పష్టం చేశా రు.

బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో పార్టీ జెం డాను సోమవారం మండలి ప్రతిపక్ష నేత మధు సూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇతర ముఖ్య నేతలతో కలిసి కేటీఆర్ ఎగురవేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం త్యాగాల పునాదుల మీద, ఆనాడు తనకు అప్పుడు ఉన్న పార్టీ ద్వారా సంక్రమించిన డి ప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్ని టికీ కూడా రాజీనామా చేసిందన్నారు.

తెలం గాణ రాష్ట్రం ఏర్పడితేనే ఒక స్వీయ రాజకీ య శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకు చరమగీతం పాడొచ్చు. శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరిసంపదలతో తులతూగిందో అట్లా మళ్లీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కొం డా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిన ఆశ్రమం జల దృశ్యంలో జెండా ఎత్తారని, ఈ 25 సంవత్స రాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్‌ఎస్ అని చెప్పారు.

పదేళ్ల తన పరిపా లనలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టిన నాయకుడు, మహానేత కేసీఆర్ అని కొని యాడారు. తెలంగాణను కాపాడడానికి, ఈ అరాచక కాంగ్రెస్, బీజేపీల నుంచి తెలం గాణను మళ్లీ ఒకసారి పట్టాలెక్కించ డానికి కేసీఆర్ నాయకత్వంలో అందరం సమష్టిగా పోరాటం చేస్తామని చెప్పారు. తప్పకుండా 2028లో తిరిగి మళ్లీ రాష్ట్రానికి కేసీఆర్‌ను సీఎం చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలంగా బలగం గా తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుదామని పిలుపునిచ్చారు.