సోమాజిగూడలో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య
పంజాగుట్ట, జూలై 8 (విజయక్రాంతి): ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని సోమాజిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నెకలకు చెందిన పాలేటి సందీప్ (36) సోమాజిగూడలోని దుర్గానగర్ లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రూమ్ మేట్ గుండా చంద్రకుమార్ (39) విధులకు హాజరయ్యేందుకు వెళ్లగా సందీప్ ఇంట్లోనే ఉన్నారు.
మధ్యాహ్నం సందీప్ సహోద్యోగి గాయత్రి వారి ఇంటి వద్దకు వెళ్లారు.తలుపును పలుమార్లు తట్టినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. కాల్ చేయగా స్పందన లభించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.సందీప్ బెడ్ రూమ్ లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో విషయాన్ని చంద్ర దీపక్ కుమార్ కు ఫోను ద్వారా తెలియజేశారు.అనంతరం మరో రూమ్ మేట్ శ్రీనాథ్ తో కలిసి తలుపు తట్టినా సందీప్ నుంచి ఎటువంటి స్పందన లభించలేదు.
అనుమానం రావడంతో డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటలా స్థలానికి చేరుకొన్నారు.అదే క్రమంలో విషయం తెలుసుకున్న సందీప్ కూడా అక్కడకు చేరుకున్నారు. పోలీసుల సహకారంతో తలుపులు తెరిచి చూడగా సందీప్ తన గదిలో ఉరివేసుకొని కనిపించారు. దీంతో పోలీసులు చంద్ర దీపక్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.






