జట్టు ఎక్కువని విద్యార్థికి గుండు.. మియాపూర్ స్కూల్‌లో వివాదం
హైదరాబాద్: మియాపూర్(Miyapur)లోని బ్లాక్ బోర్డ్ స్కూల్ లో వివాదం చోటుచేసుకుంది. స్కూల్ ప్రిన్సిపాల్(Principal) విద్యార్థికి బలవంతంగా గుండు కొట్టించాడు. జట్టు ఎక్కువగా ఉందని కత్తిరించుకోవాలని ప్రిన్సిపాల్ సూచించాడు. మొక్కు ఉందని చెప్పినా పట్టించుకోకుండా గుండు కొట్టించారని విద్యార్థి ఆరోపించాడు. ప్రిన్సిపాల్ వైఖరిపై పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
తమ అనుమతి లేకుండా గుండు గీయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో తల వెంట్రుకలు పెద్దగా పెంచుకోవదన్న రూల్ ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇటీవల కృష్ణా జిల్లా ఉయ్యూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. పది మంది విద్యార్ధుల మెడలో టీచర్ చెప్పుల దండ వేసింది. స్కూల్ కి బూట్లు వేసుకోరాలేదన్న కారణంతో టీచర్ కనకలక్ష్మి విద్యార్ధుల మెడలో చెప్పుల దండ వేసి తొటి విద్యార్థుల ముందు నిలబెట్టారు. విద్యాశాఖ అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.




