26 August, 2026 | 3:09 AM

ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

25-08-2026 11:24 PM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం  చిట్యాల మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మి సైదులు, స్థానిక కౌన్సిలర్లు, తహసిల్దార్ ఎం. విజయ్ కుమార్, ఎంపీడీవో జె.పాండు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.