19 May, 2026 | 5:04 PM

ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

19-05-2026 04:05 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్ పాషా విమర్శించారు. మంగళవారం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఛార్జీలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వి. వీరన్న, జగజంపుల తిరుపతి, బౌరే కళ్యాణ్, జగజంపుల తరుణ్ తదితరులు పాల్గొన్నారు.