calender_icon.png 9 February, 2026 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 నెలల్లో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేసింది

09-02-2026 03:42:40 PM

200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు

100 ఎకరాల్లో అభయ అరణ్య పార్క్ ఏర్పాటు

ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి, ఎంపీ గా నా నిధులు పూర్తిగా అందిస్తాం

ఎంపీ సురేష్ శెట్కర్

12 వార్డ్ లు గెలుపే లక్ష్యం, ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ శెట్కర్ తో పాటు పత్రిక సమావేశం నిర్వహించారు. పత్రిక సమావేశం లో ఎంపీ సురేష్ శెట్కర్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ వార్డ్ లో 12 వార్డ్ లు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రతి వార్డ్ లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, విధి దీపాలు, పార్క్ లు, వంటి అభివృద్ధి పనులు ఎన్నో చేపట్టాం అని అన్నారు. ఎంపీగా ఎల్లారెడ్డి పట్టణానికి, నా సేవలు పూర్తిగా ఉంటాయని ఎంపీ నిధులతో అభివృద్ధి కి కృషి చేస్తానని ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ... ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన బస్టాండ్ పునర్నిర్మాణం, పెద్ద చెరువు కట్టమీద మినీ ట్యాంక్ అభివృద్ధి పార్క్ ఇంటి గ్రేటెడ్ మోడల్ పాఠశాల, 200 కోట్లరూపాయల నిధులతో మంజూరు చేశాం అని అన్నారు. మున్సిపల్ పట్టణంలో ఇంకా అభివృద్ధి చేసేది ఎంతో ఉన్నది అని కచ్చితంగా 12 వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రజలు పట్టం కట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.