13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

08-02-2026 01:32 AM

టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు

టీఎన్‌జీవోస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అధ్యక్షుడు

ఖమ్మం, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని టీఎన్‌జీవోస్ భవనం లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూ నియన్ మున్సిపల్ ఉద్యోగుల ఫోరం 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ణు టీఎన్జీవోఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గుంటు పల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్‌జీవోస్ యూ నియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మున్సిపల్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ఫోరం పని చేస్తుందని, ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పో రాడాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందు లను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ జిల్లా జాయింట్ సెక్రటరీ తాళ్లూరి శ్రీకాంత్, మున్సిపల్ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి శ్రీనివాసరావు, మున్సిపల్ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బుర్రి వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫోరం జిల్లా కార్యవర్గం వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగు లు రాంచందర్, నాగరాజు, రవీందర్, శ్రీను, ప్రేమ్ రెడ్డి, అనురాధ, సుజిత, కవిత, రజని, వసంత, ప్రత్యుష, అర్చన, ఫోరం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.