భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి
సూరయ్యపల్లిలో టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): భూలక్ష్మి మహాలక్ష్మి సహిత బొడ్రాయి, పెద్దమ్మ తల్లి, పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. బుధవారం మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన భూలక్ష్మి మహాలక్ష్మి సహిత బొడ్రాయి స్థిర ప్రతిష్ట, పెద్దమ్మ తల్లి, పోచమ్మ కొలుపు మహోత్సవ కార్యక్రమంలో టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీను బాబు గ్రామ దేవతల ఆశీస్సులు తీసుకుని గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పంటల సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అలాగే గ్రామ దేవతల పూజలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.






