13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం

13-05-2026 09:17 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం  గ్రామస్తులు భక్తులు ఘనంగా జరుపుకున్నారు.లోక కళ్యాణార్థమై పెద్ద ఆత్మకూరు గ్రామంలో సుందరమైన శివ దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా త్రయాహిన్యక విధానంలో శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం మొదటిరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ,పుణ్యవచన, అఖండ దీపస్థాపన, రక్షాబంధనం, మాతృక,యోగిని,వాస్తు, క్షేత్రపాలక,నవగ్రహ,సర్వతో భద్ర మండల దేవత ఆవాసనం,అగ్నిప్రతిష్ట, గణపతి హావనం,బింబ సంస్కారం,ప్రతిమశోధనము, అగ్నిఅవతారణం, జలధివాసం, తీర్థప్రసరణ వితరణ తదితర కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు,మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.