13 May, 2026 | 11:16 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

08-02-2026 01:31 AM

వేములవాడ21వ కౌన్సిలర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నరాల శేఖర్

గెలుపే లక్ష్యంగా కొనసాగుతున్న శేఖర్ ప్రచారం

వేములవాడ, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) :వేములవాడ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు కౌన్సిలర్ బరిలో నిలిచిన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నరాల శేఖర్ శనివారం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని గడప గడపకూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను కలుసుకొని గత పదేళ్లుగా వార్డు సంక్షేమాభివృద్ధికి పా టుపడిన తీరును వివరించి తన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.ఈ సందర్భంగా నరాల శేఖర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధే లక్ష్యంగా కౌన్సిలర్ బరిలో నిలిచానన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచి 21వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్ గా సేవలు అందిస్తానని, ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు, మహి ళలకు స్వయం ఉపాధి ప్రోత్సాహం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడిం చారు. వార్డు ప్రజలతో నిత్యం మమేకమై వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ పారదర్శక పాలన అందిస్తానని,అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతానని పేర్కొన్నారు. మరోసారి ఎన్నికల్లో తన కు మద్దతు ఇచ్చి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో పలువురు వార్డు ప్రజలు శేఖర్ గెలుపు తధ్యమని భావిస్తున్నట్లు సమాచారం.