25 April, 2026 | 10:54 PM

సిరికొండ కొత్త ఎస్సైగా ప్రణయ్ కుమార్

25-04-2026 09:19 PM

సిరికొండ,(విజయక్రాంతి): సిరికొండ మండల పోలీస్ స్టేషన్‌కు కొత్తగా నియమితులైన ఎస్సై పి. ప్రణయ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గాదిగూడ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా నూతన ఎస్.ఐ మాట్లాడుతూ.. మండల ప్రజల సహకారంతో శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు.