26 April, 2026 | 1:27 AM

జిల్లెళ్ళు తొలగించారు

26-04-2026 12:00 AM
  1. స్టేడియం దీన స్థితిపై కమిషనర్‌కు మొట్టికాయలేసిన 
  2. మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి
  3. ఆగమేఘాలఫై స్టేడియంలో ముళ్లకంపలు పిచ్చి మొక్కల తొలగింపు

చేవెళ్ళ, ఏప్రిల్ 25(విజయక్రాంతి): జిల్లెళ్లు మొలుస్తున్నాయి అన్న కథనానికి చేవెళ్ల మునిసిపల్ పాలకవర్గ యంత్రాంగం కదిలింది. చేవెళ్ళ మినీ స్టేడియంలో మొ లిచిన జిల్లెడు చెట్లు, ముళ్లకంపలు, పిచ్చిమొ క్కలు, గడ్డిగా దం, తాగిపారేసిన మద్యం బాటిల్స్ లను తొలగించే పని  ట్రాక్టర్లు డోజ ర్, జేసీబీతోపాటు మున్సిపల్ కార్మికులు పిచ్చి మొక్కలు తొలగించే పని ఉదయాన్నే మొదలెట్టారు.

రూ. 50లక్షల ఎంపి సొంతనిధులు వె చ్చించి నిర్మించిన స్టేడియం దీనస్థితి విషయం తెలిశాక మాజీ ఎంపి రంజిత్ రెడ్డి కమిషనర్ కు మొట్టికాయలేసినట్లు తెలుస్తుంది. దీంతో మున్సిపల్ చైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి మున్సిపల్ వార్డు కౌసిలర్స్, కమిషనర్ వెంకటేశం శనివారం ఉదయాన్నే సంద ర్శించారు. స్టేడియంలో నిర్మించిన గదుల్లో పగిలిన డోర్లు, కిటికీలు, పుష్కల నీరుండి నిరూపయోగంగా ఉన్న బోర్ బావి, కూలిన కాం పౌండ్ వాల్ స్టేడియం స్థితిగతులు పరిశీలించారు.

ఈ కూలిన కాంపౌండ్ వాల్ వెలుపల స్థలంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆనవాళ్లు పరిశీలించారు. ప్రహరీ గోడ కూలడంతో అటు వైపు వెళ్లేందుకు ఆకతాయిలకు దారి సుమగమై అడ్డాగా మారింది. స్టేడియం క్లీన్ చేస్తున్న విషయం తెలిసి క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు, స్థానిక ప్రజ లు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరుబావిలోని నీరు స్టేడియంకు వచ్చే క్రీడా కారులు క్రీడాభిమానులకు అం దించి పగిలిన కిటికీలు, కూలిన ప్రహరీ సరిచేయాల్సి ఉంది.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల కౌన్సిలర్ మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగి రెడ్డి,వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్,మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు అత్తెల్లి మానిషా అనంతరెడ్డి, ఫైండ్ల మధుసూదన్ రెడ్డి, కృష్ణానాయక్,గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మంగలి యాదగిరి, నాయకులు ఆంజనేయులు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.