ప్రజా పాలన–ప్రగతి 99 రోజుల కార్యాచరణలో మొదటి రోజు
06-03-2026 08:14 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు పెద్దమల్లారెడ్డి గ్రామ పంచాయతీ పరిసరాలను శుభ్రం చేశారు. పంచాయతీ ఈఓ పాత లక్ష్మి, సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు.




