20 July, 2026 | 6:40 PM

Breaking News

మధిరకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు

20-07-2026 12:52 AM

డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ప్రజలు

మధిర, ఖమ్మం, జులై 19(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషి ఫలించింది.. మధిర నియోజకవర్గం కల నెరవేరింది.. ‘కల కలగానే మిగలలేదు... మధిర విద్యార్థుల కల నేడు ప్రభుత్వ నిర్ణయంతో నిజమైంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ జెఎన్టీయు ఇంజినీరింగ్ కళాశాల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది.

అందుకు గాను జీవో విడుదల చేసింది. మంజూరు పట్ల మధిర నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ కలను సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిమల్లు భట్టి విక్రమార్క కి మధిర నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు, మధిర నియోజకవర్గ విద్యా అభివృద్ధికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. మధిర ప్రజల కలను నిజం చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.