20 July, 2026 | 4:52 AM

108 వాహనంలో పాముకాటుకు మందు లేదు

19-07-2026 05:17 PM

సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మకండి 

ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్

ములుగు, జులై 19 (విజయ క్రాంతి): 108 వాహనంలో పాముకాటుకు మందు అందుబాటులో ఉందని సద్వినియోగం చేసుకోవాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంవత్సరంలో వాస్తవం లేదని 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. పాము కాటుకు గురైనప్పుడు ఇంట్లోనే ఇంజెక్షన్ ఇవ్వడం అనేది వైద్యపరంగా చాలా ప్రమాదకరమని, సాధారణంగా పాము కాటు విరుగుడు మందును  నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, అవసరమైన అత్యవసర సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే ఇస్తారని సూచించారు.

ఈ మందు వల్ల తీవ్రమైన అలర్జీ రియాక్షన్లు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఆసుపత్రిలోనే సత్ఫలితాలతో నయం చేయగలరని తెలిపారు. 108 అంబులెన్స్ సేవలు కేవలం రోగిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చేర్చడానికి ఉపయోగపడతాయని, ఇటువంటి ఆరోగ్య సమాచారాన్ని నమ్మే ముందు లేదా షేర్ చేసే ముందు నమ్మదగిన ప్రభుత్వ లేదా వైద్య వర్గాల నుండి ధృవీకరించుకోవడం మంచిదని ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ సూచించారు.