20 July, 2026 | 4:57 PM

చిచ్చు రేపుతున్న షెడ్ల కూల్చివేత

20-07-2026 12:00 AM
  1.  294 ఆక్రమ షెడ్లు ఉంటే 12 కూల్చడం ఏంటి? 
  2.  12 వ్యాపార షెడ్ల కూల్చివేతలో నేతల హస్తం 
  3. ఎవరు చేశారంటూ బాధితులు ఆరా 
  4. అన్నీ కూల్చాలి లేకుంటే ధర్నా చేస్తాం 

కామారెడ్డి, జులై 19 (విజయక్రాంతి): కామారెడ్డి లో ఇటీవల 12 వ్యాపార షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేత తో చిచ్చు రేగుతుంది. కామారెడ్డి లో కూల్చివేతల ఘటన దుమారం రేగుతుంది. ఎన్నో ఏళ్లుగా పాత ఏడవ నెంబర్ జాతీయ రహదారి కిరువైపులా అక్రమంగా వ్యాపార షెడ్లు వేసుకుని ప్రతినెల వేలాది రూపాయల అద్దె తీసుకుంటున్న వారి షెడ్లను వదిలి కేవలం ఒకే వర్గానికి చెందిన షెడ్లను కూల్చడంలో ఎవరి ప్రమేయము ఉందనే చర్చ జరుగుతుంది.

పార్టీలకతీతంగా ఒకే వర్గానికి చెందిన కౌన్సిలర్లు ఒక తాటి పైకి వచ్చారు. ఎవరు ఈ పని చేయించారు అనే కోణంలో చర్చిస్తున్నారు. అధికార పార్టీ నాయ కులా, ప్రతిపక్ష పార్టీ లకు చెందిన నాయకుల ఒత్తిడితో రామారెడ్డి రోడ్డు లోని వ్యాపార షెడ్లు కూల్చివేశారని మున్సిపల్ అధికారులను ఒక వర్గానికి చెందిన సంబంధిత కౌన్సిలర్ లు ప్రశ్నించారు. 12 వ్యాపార షెడ్ల కూల్చివేత వ్యవహారం పెద్ద నేతల మెడకు చుట్టుకుంది.

తాము చేయించలేదంటే తాము చేయించలేదని ఒట్టేసి చెబుతున్నారు. దీంతో బాధితులు ఎవరయి ఉంటారనే కోణంలో అధికారుల నుంచి కూపి లాగుతున్నారు. కామారెడ్డి పట్టణంలో అక్రమంగా 294 వ్యాపార షెడ్లు కొనసాగుతున్నాయని వాటన్నిటిని కుల్చాలని బాధితుల తరపున కొందరు కౌన్సిలర్లు మునిసిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి మేరకే కూల్చామని అధికారులు పేర్కొంటున్న ఇన్ని రోజుల నుంచి పట్టించుకోని అధికారులు సడన్గా చర్యలకు పాల్పడడం ఏంటది బాధితులు ప్రశ్నిస్తున్నారు.

బహిరంగంగా కామారెడ్డి పట్టణంలో అక్రమ షెడ్లు 294 ఉన్నాయని వాటిని కూడా తొలగించాలని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం అంటూ మున్సిపల్ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు.

మున్సిపల్ సమావేశంలో 12 షెడ్ల కూల్చివేతపై కౌన్సిలర్ లు మూకుమ్మడిగా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారు లు, మున్సిపల్ చైర్ పర్సన్ లు నిలదీసేందుకు సమయాత్తమవుతున్నారు. దీంతో మున్సిపల్ లో జరుగుతున్న అవినీతిపై మరికొందరు కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు ఇష్టానుసారంగా అధికారులు తప్పుడు లెక్కలు చూపారని వాటిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

294 మందికి నోటీసులు పంపినం.. 

కామారెడ్డి పట్టణంలో అనుమతులు లేకుండా 294 వ్యాపార సముదాయ షెడ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారందరికీ నోటీసులు పంపించినట్లు కమిషనర్ తెలిపారు. కౌన్సిలర్ల ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని త్వరలోనే ఆక్రమాలపై చర్యలు తీసుకొని కూల్చివేస్తామన్నారు. అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని వారికి నోటీసులు పంపామని తెలిపారు.

 పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి