20 July, 2026 | 6:38 PM

Breaking News

సమర్పయామి

20-07-2026 12:53 AM

ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత్ వన్డే సిరీస్‌లోనూ పరాజయం పాలైంది. లారడ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో పోరాడి ఓడింది. భారీ లక్ష్యఛేదనలో రోహిత్ సెంచరీతో దుమ్మురేపగా, గిల్, కోహ్లీ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివర్లో వరుస వికెట్లు కోల్పోవడం భారత్ ఓటమికి కారణమైంది. దీంతో వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ 2 కైవసం చేసుకుంది.

  1. లార్డ్స్‌లో పోరాడి ఓడిన భారత్
  2. రోహిత్ వీరోచిత శతకం వృథా
  3. సరిపోని గిల్, కోహ్లీ పోరాటం
  4. వన్డే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం

లార్డ్స్, జూలై 19 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యా టింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టు లో పలు మార్పులు జరిగాయి. గాయంతో బుమ్రా దూరమవడం కొంపముంచింది. బుమ్రా లేకపోవడంతో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెథెల్, డకెట్ చెలరేగి ఆడాడు. వీరిద్దరూ టీమిండియా యువ పేసర్లందరినీ ఉతికారేశారు. తొలి వికెట్ కు 30 ఓవర్లలో 192 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బెథెల్ 93 (91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకున్నా మరో ఓపెనర్ డకెట్ మాత్రం శతకం సాధించాడు. రూట్, డకెట్ కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ తర్వాత డకెట్ మరింత దూకుడుగా ఆడాడు.

అటు రూట్ కూడా మెరుపులు మెరిపించాడు. డకెట్ 135 బంతుల్లో 141 (18 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔటవగా తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రూక్ త్వరగానే వెనుదిరిగాడు. అయితే చివర్లో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రూట్‌తో కలిసి కేవలం 19 బంతుల్లోనే 63 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దీంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. రూట్ 48 బంతుల్లో 9 ఫోర్లతో 74 నాటౌట్, బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

భారత బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఛేజింగ్‌లో భారత్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడింది. క్రీజులో నిలదొక్కుకునేందుకు కొద్ది సమయం తీసుకున్న గిల్ , రోహిత్ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పారు. తొలి వికెట్‌కు 24.2 ఓవర్లలోనే 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గిల్ 77 (10 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔటైనా, రోహిత్ శర్మ తన దూకుడు కొనసాగించాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ విపరీతమైన ప్రచారం జరిగిన వేళ తనలో ఆట ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.

ఒకప్పటి హిట్‌మ్యాన్‌ను గుర్తు చేస్తూ చాలా రోజుల తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 84 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ వన్డే కెరీర్‌లో ఇది 34వ సెంచరీ. కోహ్లీ, రోహిత్ శర్మ 113 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ను బెథల్ బౌల్ చేశాడు. ఇక్కడ నుంచి భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ (14), శ్రేయాస్ అయ్యర్ (0) , కోహ్లీ (74), కెఎల్ రాహుల్ (12) కూడా ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. 

స్కోరు బోర్డు

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 387/3 (డకెట్ 141, బెథెల్ 91, రూట్ 74 నాటౌట్, బట్లర్ 41 నాటౌట్ ; ప్రసిద్ధ కృష్ణ 2/69, ప్రిన్స్ యాదవ్ 1/79)

భారత్ ఇన్నింగ్స్ : 360/7 (రోహిత్ శర్మ 138, గిల్ 77, కోహ్లీ 74 ; సామ్ కరన్ 4/75, ఆర్చర్ 1/63)