16 May, 2026 | 3:42 PM

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

16-05-2026 02:36 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రంలోని 33 కేవీ ఫీడర్ మరమ్మతులలో భాగంగా 11 కేవీ చందాయిపేట్, కసన్ పల్లి సబ్ స్టేషన్ పరిధిలోఆదివారం ఉదయం 8గంటల నుండి 12వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చేగుంట విద్యుత్ శాఖ ఏఈ వెంకట్ అప్పారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని మక్కారాజ్ పేట్, చందాయిపేట్, కసన్పల్లి,  గ్రామాల్లో అన్ని వ్యవసాయ, ఇండస్ట్రీయల్ విద్యుత్ వినియోగదారులకు సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సహకరించని ఆయన కోరారు.