16 May, 2026 | 3:02 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

16-05-2026 02:31 PM

బోథ్,(విజయక్రాంతి): వివిధ వ్యాధుల బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారికి శనివారం నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు 16 లక్షల 49,500 రూపాయల చెక్కులను శనివారం స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రతి ఒక్కరు. ఆరోగ్యం పైన దృష్టి సారించాలన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమ సహాయ నిధి మరింతగా పెంచాలని కోరారు. నిరుపేదలు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.