7 July, 2026 | 2:56 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

బీసీలకు సముచిత స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం

18-02-2026 08:14 PM

మునుగోడు,(విజయక్రాంతి): చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో జనరల్ స్థానాల్లో బీసీలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టడం శుభపరిణామమని బిసి నేతలు పానుగంటి విజయ్ గౌడ్, బూడిద మల్లికార్జున్ యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి బిసి యువజన సంఘం నాయకులు అభినందనలు తెలిపి మాట్లాడారు.

బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించడంలో ఇది ఒక మంచి ముందడుగు అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికీ బడుగు, బలహీన వర్గాలు,పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని, అన్ని వర్గాల అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు.యావత్ బిసి సమాజం తరఫున ఎమ్మెల్యే  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.