18 July, 2026 | 2:25 AM

పోస్ట్‌మ్యానే గొలుసు చోరీ నిందితుడు

18-07-2026 02:15 AM

24 గంటల్లో చోరీ కేసును చేదించిన పోలీసులు

బాన్సువాడ, జూలై 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడలో బంగారు గొలుసు చోరీ నిందితుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ కాదని బ్రాంచ్ పోస్ట్ మ్యానే అని తేలడంతో పోలీసులు నివ్వెర పోయారు. బాన్సువాడ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ విట్టల్ రెడ్డి మాట్లాడుతూ నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో నివాసం ఉంటూ పోస్ట్ ఆఫీస్ లో బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న

మునేశ్వర్ బుధవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పాత బాన్సువాడలోని రమేష్ కిరాణం దుకాణంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని తనిఖీలు చేపట్టిన సమయంలో రమేష్ మెడలో నుంచి రెండు తులాల మూడు గ్రాముల బంగారు గొలుసును లాక్కుని అతనిని తోసివేసి పరారైనట్లు డిఎస్పి విట్టల్ రెడ్డి తెలిపారు. దుర్గి పోస్ట్ ఆఫీస్ లో బిపిఎంగా పనిచేస్తున్న మునేశ్వర్ ఆన్లైన్ బెట్టింగులో బానిసై 12 లక్షలు పోస్ట్ ఆఫీస్ నిధులు వాడుకొని డబ్బులు వారి బంధువుల వద్ద నుంచి తీసుకొని పోస్ట్ ఆఫీస్ కు కట్టాడు.

మిగతా 45000 ఇవ్వాల్సి ఉండడంతో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెళ్లడైందని ఆయన తెలిపారు. పక్కా సమాచారం మేరకు పట్టణ సీఐ శ్రీధర్ హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ కానిస్టేబుళ్లు పాండురంగ పృథ్వీరాజ్ సుదర్శన్ లు నిందితుడు మునీశ్వరుని పట్టుకున్నారు. విచారణ అనంతరం చివరికి చోరీకి పాల్పడడం జరిగిందని ఒప్పుకున్నట్లు డిఎస్పి తెలిపారు. నిందితుడి వద్ద నుండి 2.3 తులాల బంగారు గొలుసు సెల్ఫోన్ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిఎస్పి విట్టల్ రెడ్డి తెలిపారు. 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. ప్ర జలందరూ అప్రమత్తంగా ఉండాలని అను మానం గా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉం డాలని ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సంప్రదించాలని ఆయన తెలి పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీధర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.