ఇమ్మినేని వివాహ వేడుకల్లో పొంగులేటి
రామ్ కిరణ్ సిద్ధార్థ ను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి
సత్తుపల్లి, మే06( విజయ క్రాంతి): పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమ్మినేని ప్రసాద్ రావు, హేమలత ల కుమారుడు రామ్ చరణ్ సిద్ధార్థ్, స్తుతి కరుణా హారణి వివాహ వేడుక గురువారం రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో జరగవలసి ఉండగా, బుధవారం తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మాట్టా రాగమయి దయానంద్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు వారి స్వగృహానికి వెళ్లి నూతన వరుడుకి అక్షింతలు వేసి ,నూతన వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఆశీర్వదించిన వారిలో మున్సిపల్ చైర్ పర్సన్ రెహనా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత,తోట సుజలా రాణి,నసీమా షరీఫ్,గుండా ఉమా మహేశ్వ రావు,కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.






