7 May, 2026 | 12:37 AM

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే

07-05-2026 12:12 AM

బూర్గంపాడు, మే6 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ, శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. స్థానిక సర్పంచ్ బాదం వెంకటేశ్వర రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, మండల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.