14 May, 2026 | 4:51 AM

ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష

14-05-2026 02:41 AM

మంచిర్యాల/బెల్లంపల్లి, మే 13 (విజయక్రాంతి): రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పాలిసెట్2026 ప్రవేశ పరీక్ష మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగినట్లు మంచిర్యాల జిల్లా పాలిసెట్ కో ఆర్డినేటర్, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ డినీల్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, కొమురం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ కోఆర్డినేటింగ్ కేంద్రాల పరిధిలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

మంచిర్యాల కో ఆర్డినేట్ పరిధిలో 2,364 మందికి 2,206 మంది (93.28%), బెల్లంపల్లి కోఆర్డినేటింగ్ కేంద్రం పరిధిలో 1,171 మందికి గాను 1,119 మంది (95.56%) హాజరు కాగా ఆసిఫాబాద్ కేంద్రంలో 1,064 మందికి 1,002 మంది (94.12%) విద్యార్థులు పరీక్ష రాశారు.

మంచిర్యాలలో పరీక్షా నిర్వహణకు సహకరించిన శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ తో పాటు మంచిర్యాలలో పరీక్షల నిర్వహణను బెల్లంపల్లి ప్రత్యేక పరిశీలకులు(లెక్చరర్, బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్) రాందాసు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లిలో ప్రత్యేక పరిశీలకుడు ఎ. కాంతయ్య పర్యవేక్షించగా, అసిస్టెంట్ కోఆర్డినేటర్ బి. వెంకటేశ్వర్లు, రూట్ ఆఫీసర్ ఎస్. నాగరాజు, వివిధ కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయంతో విధులను నిర్వహించారని కో ఆర్డీ నేటర్ లు ఎన్ డినీల్ కుమార్(మంచిర్యాల), ఎం దేవేందర్ (బెల్లంపల్లి) లు పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు తాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది, రెవెన్యూ , పోలీస్, ఆర్టీసీ, విద్యా, ఆరోగ్య, విద్యుత్ ఇతర శాఖల అధికారులు పరీక్ష ప్రశాంతంగా కొనసాగేందుకు సహకరించారన్నారు.