19 May, 2026 | 2:09 AM

27 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

19-05-2026 12:00 AM

జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభం

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ఈనెల 27 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు సోమవారం పాలిసెట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29 నుంచి జూన్ 1 వరకు, జూన్ 6 వరకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులు జూన్ 9 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. తుది విడత కౌన్సిలింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. జూలై 1న స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నారు.