27 July, 2026 | 3:23 PM

మారుమూల ప్రాంతానికి బీఎస్ఎన్ఎల్ టవర్

27-07-2026 03:02 PM

- ఆనందం వ్యక్తం చేస్తున్న తాండా వాసులు

తలమడుగు,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్సి బి తాండలో సెల్ టవర్ లు లేకపోవడం, నెట్ వర్క్ సమస్యతో గ్రామస్తుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎంఎల్ఏ BSNL అధికారులతో మాట్లాడి గ్రామంలో టవర్ ఏర్పాటుకు కృషి చేశారు. ఎట్టకేలకు మారుమూల ప్రాంతంలో BSNL టవర్ ఏర్పాటు కోసం సోమ వారం అధికారులు, గ్రామస్తులు భూమిపూజ చేశారు. దీనితో తాండా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.