27 July, 2026 | 3:23 PM

త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

27-07-2026 02:58 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయ క్రాంతి): అతి త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి(Super specialty hospital) ప్రారంభించుకుందామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో  ముడా నిధుల ద్వారా రూ.15 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన అధునాతన శస్త్ర చికిత్స పరికరాలను ఎమ్మెల్యే ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, తల్లులు, శిశువులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, డెలివరీ కోసం వచ్చే మహిళలకు అవసరమైన ఎక్విప్మెంట్, మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.

ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, పాన్ వాడకం వంటి చర్యలను నివారించాలని హెచ్చరించారు. డెలివరీ వార్డులో అనవసర రద్దీ లేకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  అంతకుముందు గర్భిణీ స్త్రీల ఓపి విభాగాన్ని పరిశీలించి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, కార్పొరేటర్లు సల్మాన్, షబ్బీర్ అహ్మద్, రమేష్ రెడ్డి, ఫకృ మరియు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, సాదుల్లా తదితరులు పాల్గొన్నారు.