19 May, 2026 | 3:20 AM

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

19-05-2026 12:00 AM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

కూకట్‌పల్లి, మే 18 (విజయక్రాంతి): అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించా రు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ మహిళ నాయకురాళ్ల సమీక్ష సమావేశంలో కృష్ణారావు ప్రసంగించారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచిన చేసిందేమీ లేదని, ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ బతుకమ్మ చీరలు ఇచ్చారు మిగతా ప్రాంతాలలో ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవని  ఆరోపించారు. ఈ నెల 25న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కూకట్పల్లి నియోజక వర్గంలో జరిగే కార్యకర్తల సమావేశంలో భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్లు  బాబురావు, మందాడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.