27 July, 2026 | 4:20 PM

హైకోర్టుకు హైడ్రా కమిషనర్ క్షమాపణలు

27-07-2026 03:11 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు(Telangana High Court) హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRAA Commissioner) క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు(Apologizes) చెబుతూ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని రంగనాథ్ పేర్కొన్నారు. లోతుకుంటలోని సర్వే నంబర్ 1,2 లోని 40 ఎకరాల్లోకి వెళ్లలేదని హైడ్రా కమిషన్ వివరించారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని హైకోర్టుకు సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కారణ పిటిషన్లు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఇన్ని కోర్టు ధిక్కారణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని హైకోర్టు రంగనాథ్( High Court)ను ప్రశ్నించింది.