ఎన్నికల వరకే రాజకీయం..
హుజురాబాద్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా: మంత్రి పొన్నం ప్రభాకర్
హుజురాబాద్,మార్చి10: (విజయ క్రాంతి) ఎన్నికల వరకే రాజకీయం ఉంటుందని, హుజురాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ సహకరిస్తామని తన మాటగా ప్రత్యేకంగా చెప్పారని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని పదవి బాధ్యత స్వీకరణ మహోత్సవ కార్యక్రమం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు, అనంతరం సుహాసిని మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ను, కౌన్సిలర్లను మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడుసత్యం, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్. ప్రణవ్ బాబు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రాంత ప్రజల మనబోలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధికి తమంత కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు.
హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం 300 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారని స్థానిక ఎంపీ సహకారంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం దోహదం చేస్తుందని, సీఎం రేవంత్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దిగుతుందన్నారు. గంగా ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీలను నెరవేర్చున్నామన్నారు హుజురాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పర్యావరణం పచ్చదనంగా ఉంటేనే మానవ మనుగడ బాగుంటుందన్నారు.
హుజురాబాద్ ని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. పాలన కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపులను ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేస్తున్నామని ప్రజలంతా అన్ని రకాల టెస్టులు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సంకెను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనదారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సయ్యద్, మేనేజర్ భూపాల్ రెడ్డి, 30 వార్డుల కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తో పాటు తదితరులు పాల్గొన్నారు




