పెగళ్లపాడు పూర్వవిద్యార్థులతో స్కూల్ బ్యాగుల వితరణ
ఎర్రుపాలెం మార్చి 10 (విజయక్రాంతి): మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు వితరణ చేశారు. మంగళవారం నాడు పెగలపాడు గ్రామానికి చెందిన మండల కేంద్రంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు థాక్యూ అనే ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ స్థాపించిన విద్యార్థులు ఎర్రుపాలెం జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ విద్యార్థులకు తుంగతుర్తి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడి ఆధ్వర్యంలో ఎర్రుపాలెం సర్పంచ్, పెగల పాడు సర్పంచి చేతుల మీదుగా విద్యార్థులకు సుమారు 50 వేల విలువ గల స్కూల్ బ్యాగులను విద్యార్థులకు అందించారు.
పెగలపాడు పూర్వ విద్యార్థులు సగ్గుర్తి నాగబాబు, సక్కుర్తి రమణ, షేక్ రఫీ లు వీటిని అందించారు. స్కూల్ బ్యాగుల వితరణ అనంతరం ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్విని మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. పెగలపాడు సర్పంచ్ కాకర్లమూడి అనిల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు సమాజానికి, పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీ ఎన్ రాజు మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వితరణ చేయడం ఆనందంగా ఉన్నదని పూర్వ విద్యార్థుల లాగానే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా మంచి స్థితిలో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్ శ్రీనివాసరెడ్డి, ఎం రవికుమార్, ఎం సూర్య నారాయణ, జిల్లేపల్లి సురేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.




