23-02-2026 02:24:11 AM
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములపై వేడెక్కిన రాజకీయం
కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
కామారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కామారెడ్డిలో రాజకీయ యుద్ధం కొనసాగుతున్నది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసిరుక్కుంటు న్నారు. కళాశాల ఆస్తుల వ్యవహారంపై ప్రజలకు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ నాయకులు డి మాండ్ చేస్తుంటే, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ ముందట తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు.
తాము రావడానికి సిద్ధమేనని స మయం చెప్పాలంటూ ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్ డి మాండ్ చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడారని అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం మరోవైపు కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటమే కాకుండా దాడికి ప్రయత్నిస్తున్నారని వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గతంలోనే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వస్తున్న రాష్ట్ర నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం పట్ల బీజే పీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఖం డించారు. ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉన్నదని, దాడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నేతలను పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వం కుట్రేనని అన్నారు.
అసలు విషయం పక్కదారి!
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయమై నిజాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఉన్నది. రెచ్చగొట్టే మాటలతో యుద్ధ వాతావరణం తలపించేలా అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. అయితే కాంగ్రె స్ నాయకులు కలెక్టరేట్‌కు ఆధారాలతో సహా వస్తారో రారో సోమవారం తెలియనుంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వ్యవ హారంలో ఎమ్మెల్యే కాటిపల్లి తన చిత్తశుద్ధిని బహిర్గత పరుచుకుంటారా లేక ఆరోపణలతోనే సరిపెడతారో తెలియాల్సి ఉంది. షబ్బీ ర్ అని కళాశాల ఆస్తుల వ్యవహారంపై నిజాలను బయటపెట్టేందుకు స్వయంగా వెళ్తారా లేక తన అనుచరులను పంపి చేతులు దులుపుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
పోలీసులు మాత్రం రెచ్చ గొట్టే విధంగా వ్యవహరిస్తున్న నాయకుల వివరాలను సేకరిస్తు న్నట్లు తెలుస్తున్నది. వారిపై ఎలాంటి చర్య లు తీసుకుంటారు వేచి చూడాల్సిందే. గతం లో కళాశాల ఆస్తులు వ్యవహారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఆరోపణలతోనే ముగిసింది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య సాగుతున్న యుద్ధం ఎక్కవ వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.