calender_icon.png 9 February, 2026 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందనూలులో భగ్గుమన్న రాజకీయ కక్షలు

09-02-2026 04:09:17 PM

-  బీఆర్ఏస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతల దాడి

- తీవ్ర గయాలు ఆసుపత్రికి తరలింపు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు మూకుమడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హరిజనవాడలో సోమవారం చోటుచేసుకుంది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం 13వ వార్డులోని హరిజనవాడ కాలనీకి చెందిన నీలాంటి మహేష్ అనే వ్యక్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త గంగాధర్ వెంట ప్రచారంలో పాల్గొన్నాడు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. తలపై బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తశ్రావం జరిగింది. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.