28 February, 2026 | 4:56 AM

తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో హెల్త్ క్యాంప్

09-02-2026 04:16 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం సిద్ధి రామేశ్వర్ నగర్‌లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాల లో సోమవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌ను డాక్టర్ దివ్య నిర్వహించి, అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షించి తగిన మందులు సూచించారు. అనంతరం హాస్టల్ డైనింగ్ హాల్, కిచెన్‌లను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.రఘు, వైస్ ప్రిన్సిపాల్ బి.కిషన్, హెల్త్ సూపర్వైజర్ రాజు, ఆరోగ్య విస్తరణాధికారి వెంకటరమణ, ఏఎన్‌ఎం యాదమ్మ, ఆశా నీలిమ, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.