26 August, 2026 | 3:55 AM

బీసీల రాజ్యాధికారమే లక్ష్యం

26-08-2026 01:34 AM
  1. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  2. సంగారెడ్డి జిల్లా అందోల్ నుంచి టీఆర్పీలోకి చేరికలు

హైదరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): రాష్ట్రంలో సామాజిక న్యాయం, బీసీలకు రా జ్యాధికారం సాధించడమే టీఆర్పీ ప్రధాన ల క్ష్యమని ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యువత రాజకీయాల్లో చైతన్యవంతంగా పాల్గొని సమాజ మార్పున కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా,ఆందోల్ నియోజక వర్గం నుంచి పలువురు యువకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.

పార్టీ సి ద్ధాంతాలు, బీసీల రాజ్యాధికార లక్ష్యాలు, పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నా యకత్వానికి ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారు రంగంపేట బీరయ్య, మధు, మహేష్, నరేష్,ప్రవీణ్, వినయ్ తదితరులున్నారు. ఈ సందర్బంగా పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శరత్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్పీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అన్జద్ పాషా  

తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ వి భాగ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత మహమ్మద్ అన్జద్ పాషా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అన్జద్ పాషా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్నకి, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు సల్మాన్ గారికి,రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ బం దారపు నర్సయ్య గౌడ్, జనగామ జిల్లా వ ర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, మ మ్ము, వంశీ తదితరులు పాల్గొన్నారు.