calender_icon.png 20 February, 2026 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే మొదటి వారంలో రాజకీయ పార్టీ

20-02-2026 12:00:00 AM

  1. సిద్దిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేస్తా 
  2. బీఆర్‌ఎస్ నేతలు చాలామంది టచ్‌లో ఉన్నారు
  3. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్, బీజేపీ ఉండదు 
  4. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాం తి): తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకోబోతోంది. గత కొంతకాలం గా బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ, సొం త బాటను ఎంచుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు.గురువారం ఆమె జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాల యంలో మీడియాతో మాట్లాడుతూ మే నెల మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పా టు చేయబోతున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ పేరులో కచ్చితంగా ‘తెలంగాణ’ అనే పదం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, తన ఫస్ట్‌ఛాయిస్ సిద్దిపేట, సెకండ్ ఛాయిస్ బోధన్ అని కవిత చెప్పారు. రాష్ట్ర అస్థిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉంటుందని  తెలిపారు. రాబో యే రోజుల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఉండవని అన్నారు. పార్టీ పెట్టాక తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు పూర్తి అయితే.. మా గుర్తుపై పోటీకి దిగుతామని కవిత తెలిపారు. తాము స్థాపించబోయే పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కూడా చాలామంది తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇక వైఎస్‌షర్మిలతో తనను పోలు స్తూ మాట్లాడటం తగదని హితవు పలికారు. ఆమె ఓ జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారన్నారు. పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చించరని.. ఆడవాళ్లనే ఎందుకు ప్రస్తావిస్తారని, చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడరని కవిత మండిపడ్డారు.