calender_icon.png 20 February, 2026 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత బీఆర్‌ఎస్ అనబోయి బీజేపీ అన్నట్లున్నారు!

20-02-2026 12:00:00 AM

  1. కొత్త పార్టీ పెడితే భూస్థాపితమయ్యేది బీఆర్‌ఎస్సే
  2. రెవెన్యూ, భద్రత, వ్యవసాయ రంగాల్లో శివాజీ సంస్కరణలు నేటికీ అనుసరణీయం
  3. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో రాంచందర్ రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాం తి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ పెడితే భూస్థాపితమయ్యేది బీఆర్‌ఎస్‌యేనని, బీజేపీ కాదని, కవిత బీఆర్‌ఎస్ అనబోయి బీజేపీ అన్నట్లున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ భూస్థాపితం కాకుం డా చూసుకోవాలని, కవిత ఏ పార్టీ నుంచి ఓడిపోయిందో.. ఎవరి చేతిలో ఓడిపోయిందో అందరికీ తెలుసు కదా! అన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ... శివాజీ మహారాజ్ నుంచి స్ఫూర్తి పొందిన యువత ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంద న్నారు. శివాజీ మహారాజ్ కేవలం ఒక మరాఠా యోధుడే కాకుండా, మొఘలులతో పోరాడి దేశ గౌరవాన్ని కాపాడిన మహనీయుడిగా యావత్ భారతదేశానికి గర్వకారణమ న్నారు.

ఆయనను ఆరాధించడం అనేది ఏ ఒక్క మతానికో, కులానికో పరిమితం కాదని, ఆయన పాలనలో పరిపాలనా దక్షత, ప్రజాహిత సంస్కరణలు దేశమంతటికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థ, భద్ర తా విధానాలు, వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయని తెలిపారు.

ఔరంగజేబు వంటి క్రూర పాలకులతో ధైర్యంగా పోరాడిన శివాజీ మహరాజ్ చూపిన మార్గంలో ప్రతిఒక్కరు నడవాల్సిన అవసరం ఉందని కోరారు. శివాజీ పరిపాలన విధానాలు, ధర్మపాలన, దేశభక్తి భావాలను ప్రతి భారతీయుడు అనుసరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్ర మంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, బీజేపీ తెలంగాణ పదాధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.