5 August, 2026 | 2:43 AM

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ భరోసా

05-08-2026 12:22 AM

ఎస్పీ కె.నరసింహ

సూర్యాపేట, ఆగస్టు 4 (విజయక్రాంతి): పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ భద్రత స్కీం భరోసాగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. జిల్లాలోని పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఇటీవల మృతి చెందిన యాదగిరి కుటుంబానికి పోలీసు భద్రత స్కీం ద్వారా మంజూరి అయిన చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ ఆకాలంగా ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు. దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుందన్నారు. యాదగిరి కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, డీఎస్పీ రవి, జిల్లా పోలీసు కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్త్స్ర రామచందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.