ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి
కోదాడ ఆగస్టు 4 : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు.
ఈ ఏడాది జూలై తో కలిపి ఆరు డి ఏ లు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. పిఆర్సి పై స్పష్టత ఇచ్చి సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలన్నారు. 317 జీవో రద్దు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సామాజిక భద్రత కల్పించాలన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పలువురు నాయకులతో కలిసి ఆర్డీఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ కౌన్సిలర్ చీమ నరేష్ మాజీ పట్టణ అధ్యక్షుడు కె బాబు గట్ల కోటేశ్వరరావు ఉపేందర్ గౌడ్ కరీముల్లా బాబా చలిగంటివెంకట్, నర్సిరెడ్డి తుమ్మలపల్లి భాస్కర్ గొర్రె రాజేష్ చీమ శ్రీనివాస్, మండల పార్టీ బాధ్యులు పట్టణ నాయకులు పాల్గొన్నారు.






