calender_icon.png 10 February, 2026 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ఫ్లాగ్ మార్చ్

10-02-2026 12:08:32 AM

కేసముద్రం, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మున్సిపాలిటీలో సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భం గా కేసముద్రం సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును ఏలాం టి భయాందోళన లేకుండా నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు.

ఎక్కడ కూ డా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలతో రక్షణ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సీఐ సూర్య ప్రకాష్,  కేసముద్రం సర్కిల్ ఎస్త్స్రలు క్రాంతి కిరణ్, నరేష్, కర్ణాకర్, రమేష్ బాబు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.