24 April, 2026 | 6:35 PM

Breaking News

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •  

వన్యప్రాణుల సంరక్షణకు క్యాచ్ ద ట్రాప్

10-02-2026 12:07 AM

హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్ స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి

అచ్చంపేట ఫిబ్రవరి 9: నల్లమల్లలోని వన్యప్రాణులను ఉచ్చుల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మక క్యాచ్ ద ట్రాప్ (ఉచ్చులను పట్టుకోవడం) కార్యక్రమాన్ని చేపట్టినట్లు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్ స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి తెలిపారు.

2024 నుంచి హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికోస్) స్వచ్ఛంద సంస్థ అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూరు, అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల, దోమలపెంట, నాగర్ కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ ల పరిధిలలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భాగస్వామ్యంతో 3,462 కిలోమీటర్ల నడక మార్గం పరిధిలో 1,076 ఉచ్చులను తొలగించినట్లు చెప్పారు.

వన్యప్రాణులకు హాని తల పెట్టకూడదని, వాటి సంరక్షణ మన సంరక్షణ అని పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన ప్రమాదకరం ఉచ్చు లను తొలగించారు. కార్యక్రమంలో అచ్చంపేట రేంజ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ సుబూర్, సెక్షన్ అధికారి సుజాత, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు అఖిల్ గౌడ్, శ్రీకాంత్, వికాస్, స్నేక్ క్యాచేర్ సుమన్, ఇతరులు పాల్గొన్నారు.