సింగరేణి భరోసాను అడ్డుకున్న పోలీసులు
బీజేపీ నాయకుల అరెస్టుకు యత్నం
మంచిర్యాల, జూన్ 19 (విజయక్రాంతి) : సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీ సందర్శనకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను, నాయకులను పోలీసులు అడ్డుకున్న సంఘటన శుక్ర వారం చోటుచేసుకుంది. సింగరేణి భరోసాలో భాగంగా సింగర్ అని ఓసి గని వద్దకు బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి లతో పాటు బిజెపి నాయకులను ఓపెన్ కాస్ట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
పోలీసులకు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమెల్సీ, నాయకులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో బీజేపీ శ్రేణులు పోలీస్ వాహనాలను అద్దుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ నాయకులను అడ్డుకున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ కు మద్దతిస్తుందని దుయ్యబట్టారు.
ఆర్ , యూ, బీ టాక్స్ ల పేరీట అడ్డగోలు వసూలు చేస్తుందన్నారు. మరోవైపు నాసిరకం బొగ్గు వెలికి తీయడంతో నాణ్యత తగ్గి నష్టాలు వస్తున్నాయని, వీటిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్న సింగరేణి సొమ్ము కక్కించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద గల సింగరేణి కార్మికుడి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు.






