30 May, 2026 | 1:48 AM

రష్మి ఠాకూర్‌కు నేతన్నల ఘన స్వాగతం

30-05-2026 01:33 AM

చారిత్రాత్మక కేన్స్‌లో పోచంపల్లి ఇకత్ హ్యాండ్లూమ్ ప్రదర్శన

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ హ్యాండ్లూమ్ రంగానికి గర్వకారణమైన భావోద్వేగ క్షణంగా, మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ రష్మి ఠాకూర్‌కు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్సులో జరిగిన 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారిగా పోచంపల్లి ఇకత్ హ్యాండ్లూమ్‌ను ప్రదర్శించి చరిత్ర సృష్టించిన అనంతరం ఆమె భారత్‌కు చేరుకున్నారు.

పోచంపల్లి హ్యాం డ్లూమ్ టై అండ్ డై సిల్క్ సారీస్ మాన్యుఫాక్చరర్స్ ట్రస్ట్, పోచంపల్లి ప్రొడక్షన్ హ్యాండ్లూ మ్స్ అండ్ హ్యాండిక్రాఫట్స్ ప్రొడ్యూసర్ కం పెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్, ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ తడక రమేష్ నేతృత్వంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణకు చెందిన 200 ఏళ్ల పో చంపల్లి నేయ్యాల వారసత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన రష్మి ఠాకూర్‌ను అభినందించేందుకు సుమారు 30 మంది నేతన్నలు, కళాకారులు, హ్యాండ్లూమ్ రంగ ప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ అరైవల్స్ వద్ద హాజరయ్యారు. కార్యక్రమంలో పోచంపల్లి కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, ఎల్బీ నగర్ చెనేత సంఘం సభ్యులు, మహిళా నేతన్నలు తడక రాజిని, గుర్రం హేమలత, అంకం కవిత, గుండు జ్యోతి, ఎలగందల చందనతో పాటు మరెందరో నేత కళాకారులు పాల్గొన్నారు. రష్మి ధరించిన ప్రత్యేక దుస్తులు తెలంగాణ మాస్టర్ వీవర్స్ నేసిన అసలైన పోచంపల్లి ఇకత్తో రూపొందించబడ్డాయి.