30 May, 2026 | 2:06 AM

ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం

30-05-2026 01:32 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్‌చెరు, మే 29 : ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి దేవాలయాల నిర్మాణాలను సొంత నిధులతో అతి త్వరలో పూర్తి చేసి భక్తులకు అం దుబాటులోకి తీసుకొని రానున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలి పారు. శుక్రవారం పెద్ద కంజర్ల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పుర ప్రముఖులతో కలిసి ఆలయ నిర్మాణాలను పరిశీలిం చారు.

గతంలో ఆలయ నిర్మాణాల కోసం 10 లక్షల రూపాయల విరాళాలు అందించినట్లు తెలిపారు. మరో మూడు నెలల్లో ఆల య నిర్మాణాలు పూర్తి చేసేలా 40 లక్షల రూపాయల విరాళం అందించనున్నట్లు తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఫంక్షన్ హాల్, మైనార్టీ ఫంక్షన్ హాల్స్ బ్యాలెన్స్ పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చిన్న కంజర్ల రహదారిని సైతం విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో భాగంగా నూతన దేవాలయాలు, మసీదులు, ఆశిర్ఖానాలు, చర్చిలను సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 

ఐనోలు సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక...

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని.. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో తనకు అందించాలని..

త్వరలో గ్రామంలో పర్యటించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్య్ర కమంలో కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్, దుర్గారెడ్డి, హరీష్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శివారెడ్డి, సల్మాన్ ఖాన్, నసీమా బేగం, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు.