అక్రమ వేటగాళ్లను కఠినంగా శిక్షించాలి
నవీన్ నాయక్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ
ఖమ్మం, ఆగస్టు ౧౭ (విజయక్రాంతి): జంతువులను వేటాడటానికి అక్రమంగా వేటగాళ్లు విద్యుత్తు ఉచ్చులకు జంతువులతో పాటు సాధారణ మనుషులు ఫారెస్ట్ అధికారులు బలి అవుతున్నారు. వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. దీనిలో భాగంగా ఇటీవల కారేపల్లి మండలం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బానోతు దేవ్లా నాయక్ గారి కుమారుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ నాయక్ కర్తవ్య నిర్వహణలో భాగంగా ఫారెస్ట్ లో అక్రమంగా వేసిన విద్యుత్ తీగల కు తగిలి దుర్మరణం చెందారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి షేక్ పతే మహమ్మద్, పిఎసిఎస్ అధ్యక్షులు, పుచ్చకాయల వీరభద్రం ధనియాకుల హనుమంతరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గబ్రు నాయక్ తదితరులు వారి కుటుంబాన్ని పరామర్శించి నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.






