19 May, 2026 | 3:53 AM

ఇంధన పొదుపుపై ప్రయాణికులతో ప్రతిజ్ఞ

19-05-2026 12:16 AM

ఖమ్మం టౌన్, మే 18 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రయాణికులతో పర్యావరణ పరిరక్షణ, ఇందన పొదుపు పై  బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు సోమవారం ప్రతిజ్ఞ చేపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నకిరకంటి వీరభద్రం, దార్ల శంకర్ గౌడ్, మారుతి వీరభద్ర ప్రసాద్, శాసనాల సాయిరాం, ఎలిశెట్టి మణికంఠ, వల్లాల రమేష్, రాహుల్ పాల్గొన్నారు.