బాధితుల పట్ల బాధ్యతాయుతంగా పని చేయాలి
ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్
నాగర్ కర్నూల్ మే 18 (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఇవ్వాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం జిల్లాలోని ఆయా మండలాల్లో నూతనంగా నియమించబడిన ఎస్‌ఐలకు దిశా నిర్దేశం చేశారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసాన్ని పొందగలమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కల్పించాలన్నారు. తెల్కపల్లి ఎస్త్స్రగా రమేష్, వంగూరు ఎస్త్స్రగా మాధవరెడ్డి, ఉప్పునుంతల ఎస్త్స్రగా మహేష్, బిజినపల్లి ఎస్త్స్రగా శంషుద్దీన్, తిమ్మాజీపేట ఎస్త్స్రగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.






